8, అక్టోబర్ 2025, బుధవారం

ఆ సంఘటనే ఇన్ని మార్పులకు కారణం ..


ఆ ఒక్క సంఘటనే ఇన్ని మార్పులకు కారణం

జీవితంలో ప్రతి మనిషికి కొన్ని అరుదైన క్షణాలు వస్తాయి.అవి రోజు మనం చూసేవే అయిన, అవి చిన్నవిగా కనిపించినా,వాటి వల్ల వచ్చే మార్పు చాలా పెద్దగా ఉంటుంది.అటువంటి క్షణాలు  మన ఆలోచనల దిశను,మన మనసు యొక్క  గమ్యాన్ని, మన జీవన శైలి యొక్క పద్ధతిని పూర్తిగా మార్చివేస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో కూడా జరిగింది. బయటివారికి అది సాధారణంగానే కనిపించి ఉండవచ్చు. కానీ నాకు మాత్రం అది అన్నింటిని మార్చేసిన ఒక గొప్ప క్షణం.

*** సాధారణ రోజు – అసాధారణ అనుభవం

“నేను ఒక ఇల్లు,చిన్న  కుటుంబం,చాలీచాలనంత నెలవారి జీతంతో ఒక చిన్న ఉద్యోగం కలిగిన వాడిని.కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి, ఆందోళనతో ఉంటున్నాను.

మొన్న గడిచిన ఆదివారం సాయంత్రం,నేను  అలా నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్నాను. నా మనసు ఎప్పటిలాగే ఆందోళనలతో నిండిపోయి ఉంది – ఉద్యోగంలో ఒత్తిడి, ఇంటి అవసరాలు, భవిష్యత్తు గురించి భయం. ఆలోచనలలో మునిగిపోయిన క్షణంలో, రోడ్డు పక్కన ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు.నాకు తెలుసు అతను రోడ్డు ప్రక్కల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సేకరించి వాటిని అమ్ముకుంటూ ఉంటాడు తన జీవితాన్ని సాగిస్తుంటాడు. అతని దగ్గర డబ్బు లేదు, బట్టలు సాధారణమే, తినడానికి ఏమీ లేకపోయినా, అతని ముఖంలో ఒక చిరునవ్వు ఉంటుంది. ఆ రోజే కాదు, ప్రతి రోజు అలానే ఉంటాడు. కానీ ఆ సమయంలో నేను అతని నుండి అది గ్రహించాను.

బిక్షాటన చేసే వ్యక్తిని చూస్తున్న మరొక వ్యక్తి

Tell me sudha -బిక్షాటన చేసే వ్యక్తిని చూస్తున్న మరొక వ్యక్తి 











ఆ వృద్ధుడి కన్నులలో చూసిన ప్రశాంతత నన్ను ఒక్కసారిగా ఆపేసింది. నా మనసు నాపై ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ఉంది.

ఎవరూ నన్ను వ్యక్తిగా చూడట్లేదు – నా మనసుతో నాకు జరిగిన ఒక సంభాషణ..(click here)

ఆ క్షణం నా దారిలో ఒక క్రొవ్వొత్తి వెలుగు లాంటిదని నేను గ్రహించాను

 సంతోషం మనం చూసే వస్తువులలో ఉండదు. ఆ వస్తువుని మనం చూసే విధానాన్ని బట్టి మన హృదయం సంతోషాన్ని పొందుతుంది.

డబ్బు ఉండటం వలన కొంత సౌలభ్యం వస్తుంది, కానీ శాశ్వత సంతోషం రాదు.

 ఇతరులతో పోల్చుకుంటే ఎప్పుడూ మనం తక్కువగానే కనిపిస్తాం.

కానీ మన దగ్గర ఉన్న దానిని గుర్తించి ఆనందించడం మొదలుపెడితే మనలోనే  మనకు దారిచూపే వెలుగు పుడుతుంది.

ఆ రోజు నాకు స్పష్టమైంది – 

నా అసంతృప్తికి కారణం నా పరిస్థితులు కావు, నా ఆలోచనలే కారణం అని.

ఆ వృద్ధుడి చిరునవ్వు నాకు ఒక పెద్ద పాఠం నేర్పింది. నేను నాకే ఒక మాట ఇచ్చుకున్నాను:

  •   ఇకపై ఉన్నదానిని విలువ చేసుకుంటాను.

  •   ఇతరులతో పోల్చుకోవడం మానేస్తాను.

 • ప్రతిరోజూ చిన్న విషయాలకైనా కృతజ్ఞతతో జీవిస్తాను.

ముందు నేను ఎప్పుడూ “ఇది లేదు, అది లేదు” అని బాధపడేవాడిని. కానీ ఆ రోజు నుండి “నా దగ్గర ఉన్నది చాలదా?” అనే ఆలోచన మొదలైంది.

నా ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు నేరుగా నా కుటుంబంపై కూడా ప్రభావం చూపింది.

       • నేను చిరునవ్వుతో మాట్లాడడం అలవాటు చేసుకున్నాను.

       • భార్య, పిల్లలకు సమయం కేటాయించడం ప్రారంభించాను.

       • చిన్న చిన్న విషయాలలోనే ఆనందం పంచుకోవడం మొదలైంది.

ఒకప్పుడు ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక సాన్నిహిత్యం, ఆప్యాయత పెరిగింది. కుటుంబం కూడా నాతో పాటు కొత్త వెలుగులో జీవించడం ప్రారంభించింది.

ఉద్యోగం కంటే ముఖ్యమైన 10 విషయాలు..(click here)

ఆ వృద్ధుడి చిరునవ్వు నాకు ఇచ్చిన సందేశం సులభమే కానీ అత్యంత విలువైనది:

“మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండగలిగితే, మనకు లేనిదానికోసం బాధపడాల్సిన అవసరం ఉండదు.”

ఈ మాటలలోనే జీవన సత్యం దాగి ఉంది. మనిషి సంతోషం బయట ప్రపంచంలో కాదు, మనసులోనే ఉంది.

ప్రియమైన పాఠకులారా, మీరు కూడా కాసేపు ఆలోచించండి –

 • మీ జీవితంలో మీ ఆలోచనలను మార్చిన అలాంటి ఒక క్షణం ఉందా? 
  • మీరు గుర్తు పట్టిన చిన్న సంఘటన మీకు పెద్ద పాఠం నేర్పిందా?
   • మీ దగ్గర ఉన్నదానితో ఆనందం పొందగలిగారా?

మనందరికి అలాంటి సంఘటనలు వస్తాయి. వాటిని పట్టుకుని ముందుకు వెళితే మన జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది.

ఆ రోజు నేను చూసిన వృద్ధుడి చిరునవ్వు నాకు జీవితం పట్ల కొత్త అర్ధం ఇచ్చింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను –

  • జీవితం డబ్బుతో కాదు, మనసుతో కొలవబడుతుంది.

         •  చిన్న క్షణాలు పెద్ద పాఠాలు నేర్పుతాయి.

         • సంతోషం ఎప్పుడూ మనలోనే ఉంటుంది.

ఆ ఒక చిన్న సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. నేడు నేను మరింత ప్రశాంతంగా, ఆనందంగా, కృతజ్ఞతతో జీవిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Top Ad

Your Ad Spot

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template