ఎవరూ నన్ను వ్యక్తిగా చూడట్లేదు – నా మనసుతో నాకు జరిగిన ఒక సంభాషణ
నేను:
నిజం చెప్పాలంటే, నేను విసిగిపోయాను.
ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. నా మాటలు వినిపించుకోవడం లేదు, నా కృషి ఎవరికీ కనబడదు.
నేను ఒక మనిషినే కదా, కానీ ఎవరూ నన్ను సాటి వ్యక్తిగా కూడా చూడడం లేదు.అలా నన్ను ఎవరు గుర్తించకపోతే నేను చేసే పని అంత వ్యర్ధమే కదా అనిపిస్తుంది.
నా మనసు:
అవును, నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ ఒక ప్రశ్న –
నిన్ను ఎవ్వరూ వ్యక్తిగా చూడకపోతే ఏమైంది, నువ్వే నిన్ను ఒక గొప్ప వ్యక్తి గా మంచి మనసున్న వ్యక్తిగా చూడవచ్చుకదా, నీ మంచి పనిని అందరికీ చూపించొచ్చు కదా ? అప్పుడు అందరు నీ పనిని బట్టి నిన్ను గుర్తిస్తారు,గౌరవిస్తారు కదా !!
విసుగులో మునిగిన రోజులు
నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? – నా గమనం ఎటు వైపు?(click here)
నేను:
నువ్వు చెప్పేది బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఆ విధంగా చేయడం అలా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు.
అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నప్పుడల్లా, "ఎవరు పట్టించుకొని ఈ మనిషి ఎవరు?" "ఇతని వల్ల ఎవరికి ఉపయోగం?" అని నన్నే నేను ప్రశ్నించుకుంటున్నాను.
ఒక శూన్యం, ఒక నిర్లక్ష్యం, ఒక వ్యర్థత నన్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది.
ఇలాంటి క్షణాల్లో చాలా మందికి ప్రాణాలే భారమైపోతాయి. ఆది తెలుసా ?
నా మనసు:
అవును, అది నిజమే. కానీ నువ్వు ఒంటరిగా లేవు. పైగా నువ్వు ఒక్కడివే కాదు,
ఎవరికీ కనిపించని బాధతో చాలా మంది పోరాడుతున్నారు.
నా స్నేహితుడు కూడా ఇలాగే బాధపడ్డాడు.
"ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు" అనే ఆలోచనతో చివరికి తన ప్రాణాలనే వదిలేశాడు.
ఆ సంఘటన నాకు ఒక గట్టి పాఠం నేర్పింది – జీవితాన్ని వదిలేయడం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు.
నాలోపల కనిపించిన వెలుగు
నేను:
అయితే నేను ఏమి చేయాలి?
సమాజం పట్టించుకోకపోతే నా విలువ తగ్గిపోతుందా? అప్పుడు నేను ఉన్న లేనట్టే కదా?
నా మనసు:
ఎప్పటికీ కాదు!
వజ్రాన్ని ఎవరూ కొనకపోయినా అది వజ్రమే కదా.
అలాగే నీ జీవితానికి కూడా విలువ తగ్గదు.
నువ్వే నీలోని వజ్రాన్ని గుర్తించాలి.
నేను:
కానీ ఎలా? నా వల్ల అవుతుందా?
నా మనసు:
అవును నీ వల్ల అవుతుంది.అందుకోసం మూడు మార్గాలు ఉన్నాయి –
**నువ్వు సాధించిన చిన్న విజయాలను గుర్తించు. – ఒక చిన్న పని పూర్తి చేసి నీకు నువ్వే అభినందనలు చెప్పుకో.నాకు తెలుసు గతం లో నువ్వు చేసిన పనులకు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు అభినందించే ఉంటారు.ఒక సారి ఆది గుర్తు తెచ్చుకో..
**నీ ఆలోచనలను ఒక బుక్ లో రాసుకో. – రాయడం అనేది లోపలున్న బాధకు ఓ బయట ఉన్న తలుపు లాంటిది.
**నీ శక్తిని ఉపయోగించు. – ఎవరికీ కనిపించకపోయినా, నీ ప్రతిభ నీకు తెలిసే ఉంటుంది. దాన్ని వాడుకో.
నాకు ఓ టాలెంట్ ఉంది – నేను దానిని ఎలా గుర్తించాను?(Click here)
ప్రేరణ ఇచ్చిన క్షణం
నేను:
అవును, నువ్వు చెప్పేవి అన్ని నాకు జరిగాయి. ఒకసారి పార్క్‌లో కూర్చుని చిన్నపిల్లలు ఆడుకుంటూ చూసాను.
వాళ్ళు తమలో తమే నవ్వుకుంటూ, కేకలు వేస్తూ, సంతోషపడుతున్నారు.
వారిని ఎవరైనా పట్టించుకున్న లేకపోయినా, వారికి అనవసరం, తాము సంతోషంగా ఉన్నాము అదే వారికి అవసరం.
ఆ దృశ్యం నాకు ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చింది –
“నేను నాకోసం బ్రతకాలే కానీ,ఇతరుల గుర్తింపు కోసం కాదు.నా గురించి నేను బ్రతకడమే నాకు ఆనందం అవ్వాలి,అందుకు నన్ను నేను గౌరవించాలి మరియు ప్రేమించాలి"అని.
స్వీయ గౌరవం పాఠం
నా మనసు:
స్వీయ గౌరవం అంటే అహంకారం కాదు.
అది “నేను విలువైన వాడిని” అనే సత్యాన్ని అంగీకరించడం.
ప్రపంచం నిన్ను నిర్లక్ష్యం చేసినా, నీవు నీలోని వ్యక్తిని గౌరవించాలి.
అదే నీకు కొత్త జీవితం ఇస్తుంది.
నేను:
నిజమే. ఇకనుంచి నేను –
** నా ప్రతిభను చిన్నచూపు చూడను.
** నా లోపల ఉన్న వ్యక్తిని గౌరవిస్తాను.
** నా ప్రాణం విలువైనదని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
జీవితం వదిలేయాలనిపించిన క్షణం
నా మనసు:
గమనించు, జీవితం వదిలేయాలని అనిపించే క్షణమే – కొత్త జీవితం ప్రారంభించడానికి సరైన సమయం.
నీ బాధే నీ బలం అవుతుంది.
నీ విసుగే నీకు కొత్త మార్గం చూపుతుంది.
నేను (చివరగా):
అవును, నన్ను నేను అర్థం చేసుకున్నాను.
ఎవరూ నన్ను వ్యక్తిగా చూడకపోతే ఏమైంది – నన్ను నేనే వ్యక్తిగా చూసుకుంటాను.
అదే నా బలం.
అదే నా కొత్త పయనం.
ఒక మాట
మనసులో విసుగు, ఒంటరితనం, నిర్లక్ష్యం – ఇవి ఎవరినైనా కుంగదీస్తాయి.
కానీ జీవితం వదిలేయడం అనేది దానికి పరిష్కారం కాదు.
నీ ప్రాణం విలువైనది. నీ ఉనికి అవసరమైనది. నీ కలలు మరొకరికి ప్రేరణ కావచ్చు.
ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా, నీలో ఉన్న నిన్ను పట్టించుకుంటే – అదే నీ నిజమైన జీవితం అవుతుంది మరియు విజయమవుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి