ప్రేమలో చేసిన తప్పులు – వివాహానంతరం నేర్చుకున్న విలువైన పాఠాలు
జీవితంలో కొన్ని బాధలు మనసును పగలగొడతాయి,
కానీ అదే పగుళ్లలోంచి వెలుగు లోపలికి వస్తుంది.
నా ప్రేమ విఫలమైంది — కానీ ఆ విఫలం నాకు శాపం కాదు,
అది నా నిజ జీవితానికి దిశ చూపిన గురువు అయ్యింది.
ప్రేమలో నేను చేసిన కొన్ని తప్పులు,
వివాహానంతరం నా బంధాన్ని రక్షించిన పాఠాలుగా మారాయి.
1.నా గత ప్రేమలో ఎక్కువ మాట్లాడాను, తక్కువ విన్నాను..
ప్రేమలో ఉన్నప్పుడు, నేను ఎప్పుడూ నా భావాలనే చెప్పేవాడిని.నా భావాలు తనకి చెప్తే అర్ధం చేసుకుని నన్ను నన్నుగా ఇష్టపడుతుందనీ..
“నాకు ఇది ఇష్టం”, “నాకు ఇలా ఉండటం అంటే ఇష్టం” “నాకు కాబోయే వారు ఇలా ఉంటేనే నాకు ఇష్టం”అని –
కానీ ఎదుటివారి హృదయం ఏం చెబుతోందో వినడం మర్చిపోయాను. నా ప్రేమ విఫలం అయినప్పుడు అనుకున్నాను "ప్రేమ అంటే మాటలతో చూపులతో మాత్రమే సాగే బంధమని”“ఈ కాలం అమ్మాయిలు అందరూ ఇంతే” అని, తప్పు మొత్తం ఆమె పైనే నెట్టేశాను.కానీ తప్పు ఆమె లో కాదు నాలో నామనసులో ఉంది అని ఇప్పుడు అర్థమైంది —
![]() |
Tell me sudha - నిశ్శబ్దంలో విరిగిన ప్రేమ, అర్ధంలో మళ్లీ పుట్టిన బంధం |
ప్రేమ అంటే చెప్పడమే కాదు వినడం కూడా నేర్చుకోవాలి.
వివాహం చేసుకున్న తర్వాత నేను నేర్చుకున్న మొదటి పాఠం ఇదే:
మాటలకన్నా వినడంలోనే బంధం బలపడుతుంది.నా భాగస్వామి చెప్పేవి వినడం వల్ల తనలో ఆనందం చూసాను,తను ఆనందంగా ఉన్నప్పుడు మన మాట వింటారు అర్ధం చేసుకుంటారు.అప్పుడు ఒకరిపై ఒకరికి ఇష్టం బలపడుతుంది.
2. మితిమీరిన ప్రేమ కూడా ఒక తప్పు
ప్రేమలో “ఎక్కువ ప్రేమ చూపడం” అంటే తన పట్ల జాగ్రత పడటం అనుకున్నాను.
ఆమె ఎక్కడికి వెళ్లినా నేను తెలుసుకోవాలని,
ప్రతి విషయంలో నా అభిప్రాయం ఉండాలని భావించేవాడిని.ఒక్కో సారి నాకు చెప్పడం తనకు ఇష్టం లేకపోయిన కవ్వించి మరీ అడిగేవాడిని,తను ఎక్కడైనా అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటుందేమో అని..అలా అలవాటు అవ్వడం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతి నిర్ణయంలో నా జోక్యం ఉండేది. ఆ అలవాటు నా బంధాన్ని క్రమంగా ఊపిరాడనివ్వలేదు.
ఇప్పుడు నేర్చుకున్నాను –ప్రేమ అంటే నియంత్రణ కాదు, స్వేచ్ఛకు భద్రత ఇవ్వడం.ఇప్పుడు నా భార్య తన సమయాన్ని, తన ఆలోచనలను స్వేచ్ఛగా నాతో పంచుకుంటుంది,ఎందుకంటే గతంలో చేసిన తప్పులు కారణంగా నా అనుకునే వారిని నుండి దూరమైపోయాను. ఇప్పుడు మాట వినే భర్తగా మారాను, నడిపించే వ్యక్తిగా కాక కలిసి నడిచే తోడుగా ఉన్నాను.
ఆ సంఘటనే ఇన్ని మార్పులకు కారణం..(click here))
3. మౌనం కోపం కాదు అని తెలుసుకున్నాను
ముందు ఆమె మాట్లాడకపోతే, “ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావ్?” అని వాదించేవాడిని.నా దగ్గర ఏదో దాస్తుంది అనిపించేది.ఆ విషయం తెలుసుకునే వరకు నా మనసుకు నిదానం ఉండేది కాదు.
ఇప్పుడు అర్థమైంది — కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ప్రేమే అని.అన్ని విషయాలు చెప్పడం అందరికీ కుదరదు. మాట్లాడకపోతే “నాకు కోపం ఉంది” అని కాదు, “నాకు ప్రశాంతత కావాలి” అని చెబుతుంది.
అందుకే నేను ఇప్పుడు మౌనాన్ని గౌరవిస్తాను,అప్పుడు తనకు ఏం అవసరమో కూడా అర్థమౌతుంది,
అది మాటలకన్నా బలమైన బంధం అని నమ్ముతాను.
4. ప్రేమలో సహనంగా ఉండడం – వివాహ బంధానికి ఆశీర్వాదం
పాత ప్రేమలో నేను ప్రతి చిన్న విషయానికి తక్షణమే స్పందించే భావోద్వేగంతో వ్యవహరించేవాడిని.అక్కడ విషయం ఏంటో తెలుసుకోకుండా వెంటనే ప్రతిస్పందించే వాడిని.వేచి ఉండడం గాని,సహనం గాని ఉండేవి కాదు.దాని వల్ల ఆమె నన్ను దూరం పెట్టింది ఏమో ...
ఇప్పుడు నేర్చుకున్నాను – సమయం మరియు సహనం ఏ బంధానికైనా రక్షణ.
వివాహంలో చిన్న విషయాలకైనా శాంతితో ఆలోచించడం,
మాటలకన్నా చర్యలతో ప్రేమ చూపడం —
అవి నిశ్శబ్దంగా మా బంధాన్ని కాపాడే గోడలుగా మారాయి.
పశ్చాత్తాపం నుండి నేర్చుకున్న 10 జీవన పాఠాలు(click here)
5. విఫలమైన ప్రేమ నాకు మంచి జీవిత భాగస్వామిని తయారుచేసింది.
ఆ ప్రేమ విఫలం నన్ను బలహీనుడిని చేయలేదు.
అది నన్ను జాగ్రత్తగా ప్రేమించేవాడిగా మార్చింది.
ప్రేమలో చేసిన తప్పులు నాకు ఇప్పుడు నా దారికి దీపాలు అయ్యాయి.
ప్రతీ సారి నేను ఓపిక కోల్పోయే ముందు ఆ పాత అనుభవం గుర్తుకు వస్తుంది.
అప్పుడు నేను నవ్వుకుంటాను –
“ధన్యవాదాలు, ఓ విఫల ప్రేమా… నువ్వు లేకపోతే నేను ఈ బలమైన మనిషిని కాకపోయేవాడినేమో, మంచి భర్త. కాలేకపోయేవాడినేమో ”
నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? – నా గమనం ఎటు వైపు?(Click here)
ఒక మాట
ప్రతీ ఒక్కరూ పెళ్లికి ముందు ఎవరో ఒకరిని ప్రేమిస్తారు,కొందరికి ప్రేమ విఫలం అవ్వొచ్చు. ప్రేమలో చేసిన తప్పులు మనసును పగలగొడతాయి,
కానీ అదే పగుళ్లలోంచి మన వ్యక్తిత్వం పెంపొందించుకోవాలి.
ఆ విఫలం లేకపోతే నేను ఈరోజు ఇలా మారేవాడిని కాదు.
వివాహం తర్వాత నేను నేర్చుకున్న ప్రతీ నియమం,
అదే పాత ప్రేమ నేర్పిన పాఠం.
🕊️ ప్రేమ విఫలమవ్వడం బాధ కలిగిస్తుంది, కానీ అదే మనసుకు కొత్త శిక్షణా శిబిరం.
అక్కడ నేర్చుకున్న నియమాలే మన జీవితాన్ని కాపాడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి