ఉద్యోగం కంటే ముఖ్యమైన 10 విషయాలు
ఉద్యోగం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ అది మన ఆనందం, మనశ్శాంతి, కలలు, సంబంధాలు అన్నింటికన్నా ముఖ్యమైపోతే, జీవితం యొక్క అసలైన విలువ కోల్పోతుంది. ఉద్యోగం కోసం జీవించకూడదు, జీవించడానికి ఉద్యోగాన్ని వాడుకోవాలి.
ఇప్పుడు నా అనుభవం, చుట్టూ చూసిన ఉదాహరణలతో ఉద్యోగం కంటే జీవితంలో ముఖ్యమైన 10 విషయాలు చూద్దాం.
1. ఆరోగ్యం – ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించిన వృధా
పెద్దలు చెప్పిన మాట: “ఆరోగ్యమే మహాభాగ్యం.”
ఉద్యోగం కోసం రాత్రింబగళ్లు పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, చివరికి సంపాదన అంతా ఆసుపత్రులకు వెళ్తుంది.
ఉదాహరణకి, నా పరిచయంలో ఒకరు IT ఉద్యోగం చేస్తూ, నిద్ర లేకుండా పనిచేశారు. 35 ఏళ్లకే గుండె సమస్యలు వచ్చాయి. సంపాదన ఉన్నా, జీవితం ఆనందించలేకపోయారు.
2. కుటుంబం – మన జీవన పునాది
డబ్బు కోసం కష్టపడటం తప్పు కాదు. కానీ కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మాత్రం తప్పు.
ఒక పిల్లవాడు చిన్నప్పుడు తల్లిదండ్రుల స్నేహం కోరుకుంటాడు. కానీ “ఆఫీస్‌లో బిజీ” అని మరిచిపోతే, సంవత్సరాల కాలం తరువాత ఆ బంధం దూరమవుతుంది. డబ్బుతో ఆ లోటు నింపలేం.
 |
Tell me sudha- కుటుంబంతో ఆనందిస్తున్న ఉద్యోగి |
3. మనశ్శాంతి – ప్రశాంత మనస్సే నిజమైన ధనం
జీతం ఎక్కువ ఉన్నా, మనశ్శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
కాస్త సమయం స్నేహితులతో గడపడం, కుటుంబంతో నవ్వుకోవడం, ప్రకృతిలో తిరగడం మనస్సుకు శాంతి ఇస్తాయి. ప్రశాంత మనస్సు ఉన్నప్పుడే మనం సంపాదనను కూడా ఆనందించగలం.
4. స్వేచ్ఛ – మన నిర్ణయాలు మన చేతిలో ఉండాలి
మంచి జీతం ఉన్న ఉద్యోగం అయినా, స్వేచ్ఛ లేకపోతే అది బానిసత్వమే.
చాలామంది స్వతంత్రత కోసం స్వంత వ్యాపారం మొదలుపెడతారు. ఎందుకంటే స్వేచ్ఛే నిజమైన సంపద.
5. ఆత్మసంతృప్తి – మనసుకు నచ్చిన పని నిజమైన ఆనందం
డబ్బు వస్తుందని మనసుకు నచ్చని ఉద్యోగం చేస్తే, చివరికి అసంతృప్తి భావమే మిగులుతుంది.
ఒకరు చిత్రకళ, సంగీతం లేదా రచన అంటే ఇష్టపడతారు కానీ ఉద్యోగం కోసం ఆ అభిరుచిని వదిలేస్తారు. అలాంటి వారిలో అసంతృప్తి పెరుగుతుంది.
మనసుకు నచ్చిన పనిలో చిన్న ఆదాయం వచ్చినా, అది ఇచ్చే ఆనందం గొప్పది.
6. సమయం – తిరిగి రాని సంపద
సమయం డబ్బుకన్నా విలువైనది. ఒకసారి పోయిన సమయం తిరిగి రాదు.
ఉద్యోగం పేరుతో కుటుంబం, స్నేహం, స్వీయాభివృద్ధి అన్నీ కోల్పోతే, జీవితంలో ఆనందం కరువవుతుంది.
7. ఆత్మవికాసం – మన ప్రతిభ వెలుగులోకి రావాలి
ఉద్యోగం కారణంగా ప్రతిభ పక్కన పడిపోవడం ఆత్మవంచన.
కొంతమంది మంచిగా రాయగలరు మరియు గొప్ప క్రియేటివిటీ కలిగి ఉంటారు కానీ ఉద్యోగ ఒత్తిడితో వాటికి సమయం ఇవ్వలేరు.
ప్రతిభను పెంపొందించడం మనకే కాదు, ప్రపంచానికీ ఒక వరం.
8. సంబంధాలు – నిజమైన సంపద మనుషులు
డబ్బు ఉన్నా సంబంధాలు లేకుంటే జీవితం ఒంటరితనం అవుతుంది.
స్నేహాలు, బంధాలు మనసారా నిలిచిపోతాయి. జీతం కంటే, మనతో చివరివరకు నిలిచేది ప్రేమించే మనుషులే.
9. కలలు – మన జీవన దిశ
ఉద్యోగం కోసం మన కలలను త్యజించకండి.
ఉదాహరణకి, రచన అంటే ఇష్టమైతే ఉద్యోగం చేస్తూనే ఆర్టికల్స్ రాస్తున్న. వ్యాపారం కల ఉంటే చిన్న ప్రయత్నాలతో మొదలుపెట్టాలి.
కలలు మన జీవితానికి దిశ చూపించే దీపస్తంభం.
10. జీవన లక్ష్యం – డబ్బు మాత్రమే కాదు, ఉన్నతమైన ఉద్దేశం
జీవితం కేవలం జీతం కోసం కాదు. మన ప్రయాణానికి ఒక ఉద్దేశం ఉండాలి.
ఇది ఇతరులను సహాయం చేయడం కావచ్చు, మంచి కుటుంబం నిర్మించడం కావచ్చు లేదా కొత్తదాన్ని సృష్టించడం కావచ్చు.
జీతం సహాయకం కానీ, జీవిత లక్ష్యం పెద్దది కావాలి.
ఒక మాట
ఉద్యోగం తప్పనిసరి, కానీ అది జీవితం మొత్తం కాదు. ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి, స్వేచ్ఛ, సంబంధాలు, కలలు – ఇవన్నీ కలిసే నిజమైన జీవనార్ధం.
👉 మీ జీతం మీకోసం పనిచేయాలి, మీరు జీతం కోసం బానిసలా మారకూడదు.
👉 ఉద్యోగం కోసం జీవించకండి. జీవించడానికి ఉద్యోగాన్ని వాడుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి